Saturday, November 15, 2025
Homeజిల్లాలుఅనంతపురంసబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..

- Advertisement -

విశాలాంధ్ర: చిలమత్తూరు.. శ్రీ సత్య సాయి జిల్లా .చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం పై బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించారు, ప్రభుత్వ కార్యాలయ అధికారుల పై చాలా కాలం నుండి అవినీతి అక్రమాల ఆరోపణలు ఉన్నాయి,ఈనేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఏసీబీ సీఐ జయమ్మ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం తనిఖీలు చేశారు. ఏసీబీ అధికారులు కార్యాలయ లోపలికి వెళ్లి ఇంటి స్థలాలు. సాగు భూములు క్రయవిక్రయాలకు వచ్చిన వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.అయితే అందుకు భిన్నంగా కార్యాలయానికి తలుపులు వేసి దాదాపు రెండు గంటల పాటు కంప్యూటర్లు. రికార్డులు, సబ్ రిజిస్టర్ ప్రసాద్ వాహనం, తదితరుములను క్షుణంగా పరిశీలించారు. తనిఖీల్లో ఎలాంటి అవినీతి బయటపడలేదు.ఏసీబీ సీఐ జయమ్మ విలేకరులతో మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయం పట్ల ఎలాంటి ఫిర్యాదులు తమకు అందలేదని సాధారణ తనిఖీల్లో భాగంగా చిలమత్తూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం తనిఖీ చేయడం జరిగిందన్నారు,నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించడం జరిగిందని అందులో భాగంగానే చిలమత్తూర్లో కూడా తనిఖీలు చేశామని అయితే ఎలాంటి అవినీతి బయటపడలేదని ఆమె పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు