విశాలాంధ్ర శింగనమల.. శింగనమల నియోజకవర్గం పుట్లూరులో స్కూలు పిల్లలతో వెళుతున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది, బుధవారం సాయంకాలం స్కూలు పూర్తవగానే పుట్లూరు మోడల్, జడ్పీ స్కూళ్లకు చెందిన విద్యార్థులను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సు మడ్డిపల్లికి బయల్దేరింది, చింతకుంట వద్దకు బస్సు రాగానే స్టీరింగ్ స్ట్రక్ కావడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు బస్ ఎక్కడం వల్ల అధిక లోడుతో వెళుతూ ప్రమాదం జరిగిందని పలువురు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం అధికారుల అలసత్వమే కారణమని సిపిఐ పుట్లూరు మండల కార్యదర్శి పెద్దయ్య అన్నారు. ఆర్టీసీ బస్సులను సమయానకూలంగా విద్యార్థులకు నడపమని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోలేదన్నారు. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 9 గ్రామాలకు ఈ ఒక్క బస్సే దిక్కని, అధిక లోడుతో వెళ్తుందని ఆయా గ్రామా ప్రజలు వాపోతున్నారన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్కూలు వేళలకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
- Advertisement -
RELATED ARTICLES


