Homeసినిమాగ్లామర్ స్టార్‌గా వచ్చి గ్లోబల్ స్టార్ అయిన సమంత

గ్లామర్ స్టార్‌గా వచ్చి గ్లోబల్ స్టార్ అయిన సమంత

- Advertisement -

హైదరాబాద్: సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంతో ఎప్ప్పుడూ వార్తల్లో నిలిచే స్టార్ హీరోయిన్ సమంత. ఈ గ్లామర్ స్టార్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సమంత గత డిసెంబర్‌లో రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి అయిన తర్వాత ఆమె షేర్ చేసిన ఫొటోలు తన అభిమానులు ఇప్ప్పుడు గుర్తు చేసుకుంటూ…‘బర్త్‌డే వీక’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మంగళవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా, ఆమెకు సంబంధించిన అనేక విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పదహారేళ్ల క్రితం జెస్సీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గ్లామర్ క్వీన్…నేడు పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన సమంత పుట్టిన రోజు సందర్భంగా ఆమె సినీ కెరీర్ గురించి తెలుసుకుందాం.
గ్లామర్ క్వీన్‌గా ఎంట్రీ
సమంత ‘ఏ మాయ చేసావె’లో అమాయకపు చూపులతో జెస్సీగా నాగచైతన్య సరసన నటించి తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆమె చూపించిన మెచ్యూరిటీ…కళ్లతో ఆమె పలికించిన హావభావాలు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక గ్లామర్ క్వీన్ వచ్చిందని చెప్ప్పుకున్నాయి సినీ వర్గాలు. తెలుగులో తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో తరువాత అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంది. ‘దూకుడు’, ‘ఈగ’, ‘అత్తారింటికి దారేది’ వంటి భారీ విజయాలతో టాలీవుడ్ గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది. 2012 నుంచి 2017 వరకూ వరుస చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్టార్‌డమ్‌తో పాటు మార్కెట్‌ను సృష్టించుకుంది. ఆమె స్టైల్, గ్లామర్, చిలిపి నటన ప్రేక్షకులను కట్టిపడేశాయి.
రంగస్థలంలో ‘ఎంత చక్కగున్నావే’ అనిపించుకుని…
నటనలో పరిణతి చెంది…వరుస సినిమాల్లో భిన్నంగా కనిపించినప్పటికీ ఆమెలోని నటిని బయటకు తీసుకువచ్చింది మాత్రం ‘రంగస్థలం’లోని రామలక్ష్మి పాత్రే. మేకప్ లేకపోయినా ‘ఎంత చక్కగున్నావే’ అని అందరితో అనిపించుకుంది. అదే ఏడాది ‘మహానటి’లో మధురవాణిగా జర్నలిస్ట్ పాత్ర పోషించి, ఆమె నటనలో ఒక కొత్త కోణాన్ని ప్రపంచానికి చూపింది. ఆమె కెరీర్‌లో గుర్తుండి పోయే చిత్రం ‘మజిలీ’. ఇందులో శ్రావణి పాత్రలో సామ్ ఒదిగిన తీరుకు శభాష్ అనిపించుకుంది. ‘ఓ బేబీ’తో ఒక వృద్ధురాలు యువతిగా మారితే ఎలా ఉంటుందో అద్భుతంగా నటించి, తనేంటో నిరూపించుకుంది. సమంత సినీ ప్రయాణంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ (రాజీ పాత్ర) ఒక టర్నింగ్ పాయింట్. గ్లామర్ పక్కనపెట్టి ఒక సీరియస్ రోల్‌లో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అటు ‘పుష్ప’లో ఊ అంటావా మామా అంటూ మాస్ సెన్సేషన్ సృష్టించినా, ఇటు ‘యశోద’, ‘శాకుంతలం’ వంటి స్త్రీ ప్రాధాన్యత గల సినిమాలతో బాధ్యతను భుజాన వేసుకున్నా… అది సమంతకు మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం అందరితో బంగారం అనిపించుకోవడానికి ‘మా ఇంటి బంగారం’తో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు