న్యూదిల్లీ: బీసీసీఐ సెలక్షన్ కమిటీ తనను పక్కన పెట్టినప్పటికీ మీడియం పేసర్ భువనేశ్వర్ కుమార్ మాత్రం ఐపీఎల్ 2026లో తన గణాంకాలతో దుమ్ము రేపుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరపున ఆడుతున్న 36 ఏళ్ల భువీ, సోమవారం దిల్లీ వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు పడగొట్టి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. 2022 తర్వాత భారత జట్టుకు దూరమైనా, గడిచిన 3-4 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. పవర్‌ప్లేలో భువీని మించిన బౌలర్ భారత క్రికెట్‌లో లేదని స్పష్టమవుతోంది. 2023 నుంచి ఐపీఎల్‌లో పవర్‌ప్లే (తొలి ఆరు ఓవర్లు) గణాంకాలను చూస్తే భువనేశ్వర్ ఆధిపత్యం స్పష్టమవుతుంది. ఈ సీజన్‌లో కేవలం 8 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీసి ఆర్సీబీకి కీలక బౌలర్‌గా మారాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 32 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్(32)తో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కేవలం ప్రస్తుత ఫామ్ మాత్రమే కాదు, ఐపీఎల్ చరిత్రలోనే భువనేశ్వర్ ఒక లెజెండ్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు మూడు వికెట్లు తీసిన బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా (25) తర్వాత భువీ (20 సార్లు) రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ‘డాట్ బాల్స’ వేసిన రికార్డు సైతం తన పేరిటే ఉంది. ఇటీవల 200 వికెట్ల మైలురాయిని దాట తొలి భారత పేసర్‌గా చరిత్ర సృష్టించిన భువీ, ప్రస్తుతం 212 వికెట్లతో దూసుకుపోతున్నాడు. వాస్తవానికి.. 2022 ప్రపంచకప్ తర్వాత వేగం తగ్గిందనే విమర్శలతో భువనేశ్వర్ కుమార్‌ను జట్టుకు దూరం చేశారు. కానీ, 2026 సీజన్ గణాంకాలు చూస్తుంటే, ఒక అనుభవజ్ఞుడైన బౌలర్ పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా మారాడో అర్థమవుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల జట్లు సులభంగా 200 పైచిలుకు స్కోర్లు చేస్తున్న తరుణంలో పవర్‌ప్లేలో వికెట్లు తీస్తూ 8.00 లోపు ఎకానమీని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బుమ్రాకు సరైన జోడీ కోసం వెతుకుతున్న టీమ్ ఇండియాకు, భువనేశ్వర్ కుమార్ ప్రస్తుత ఫామ్ ఒక బలమైన సంకేతం పంపిస్తోంది.


