విశాలాంధ్ర – విజయవాడ స్పోర్ట్స్ :విజయవాడకు చెందిన లోటస్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారుడు ఎం. మణిపల్లె అనంత కృష్ణ కౌశిక్ జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. హైదరాబాద్‌లోని జ్వాలా గుట్ట అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్, మొయినాబాద్ వేదికగా ఆగస్టు 3 నుండి 5 వరకు నిర్వహించిన డెఫ్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్–2026లో పురుషుల సింగిల్స్ విభాగంలో విజేత గా నిలిచి జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ ఛాంపియన్‌షిప్‌ను డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్ నిర్వహించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి పాల్గొన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను అధిగమించి కౌశిక్ ఈ ఘన విజయాన్ని సాధించాడు.
ఈ సందర్భంగా లోటస్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రధాన కోచ్ ఎం. ప్రతాప్ కుమార్ (ఎన్ ఐ ఎస్) మాట్లాడుతూ, కౌశిక్ సాధించిన విజయం విజయవాడకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని అన్నారు. అతని కృషి, క్రమశిక్షణ, పట్టుదల యువ క్రీడాకారులకు ఆదర్శమని పేర్కొన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.లోటస్ బ్యాడ్మింటన్ అకాడమీ తరఫున కౌశిక్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడు కృష్ణ కౌశిక్ ను, చీఫ్ కోచ్ ఎం ప్రతాప్ కుమార్ ను గేమ్ ఆన్ ఇండోర్ కోర్టు ఇన్చార్జ్ చావలి శివ ప్రసాద్, లోటస్ అవర్ జోన్ గ్రౌండ్ సెక్రటరీ కొత్తూరు చంద్రమోహన్, అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ అభినందించారు.
జాతీయ డెఫ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో నగర క్రీడాకారుడికి బంగారు పతకం
- Advertisement -
RELATED ARTICLES


