కేకేఆర్‌కు అశ్విన్ షరతు
ఐపీఎల్ వర్గాల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ట్రేడింగ్‌కు సంబంధించి ప్రస్తుతం జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ ముంబై ఇండియన్స్ హార్దిక్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ కు ట్రేడ్ చేయాలని భావిస్తే, దానికి బదులుగా ఆ జట్టు నుంచి స్టార్ ప్లేయర్లు రింకూ సింగ్, హర్షిత్ రాణాలను తీసుకోవాలని ఆయన సూచించారు. అప్పుడే ఈ ట్రేడ్ ముంబై జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని అశ్విన్ స్పష్టం చేశారు.
వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు హార్దిక్‌ను చెన్నై సూపర్ కింగ్స్ లేదా కేకేఆర్‌కు ముంబై యాజమాన్యం ట్రేడ్ చేయవచ్చని వస్తున్న వార్తలపై అశ్విన్ తన విశ్లేషణను పంచుకున్నారు. హార్దిక్ చేరిక వల్ల సీఎస్కే కంటే కేకేఆర్కే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. హార్దిక్‌తో కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఏ ట్రేడ్ చేసినా ప్రత్యర్థి జట్టు మనకంటే బలంగా మారకుండా జాగ్రత్త పడాలిఁ అని ముంబై ఇండియన్స్‌కు ఆయన హితవు పలికారు.2015లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన హార్దిక్, 2022లో గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా వ్యవహరించి తొలి సీజన్లోనే టైటిల్ అందించారు. అయితే తిరిగి ముంబైకి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టు ప్రదర్శన నిరాశపరిచింది. 2024లో చివరి స్థానంలో నిలిచిన ముంబై, 2026 సీజన్లో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ వైఫల్యాల నేపథ్యంలోనే ఆయన ట్రేడింగ్‌పై వస్తున్న వార్తలు మరింత ఊపందుకున్నాయి.


