Homeఆంధ్రప్రదేశ్మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందిస్తాం

మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందిస్తాం

- Advertisement -
  • ఎంపీ కేశినేని చిన్ని
  • కార్యక్రమంలో పాల్గొని బైక్ నడిపిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజలి
    విశాలాంధ్ర– విజయవాడ స్పోర్ట్స్ : మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్యూఏపీఎల్) నిర్వహించడం పట్ల గర్వంగా ఉందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నట్లుగానే క్రికెట్‌లోనూ అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారని పేర్కొన్నారు.మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, పోటీలకు మద్దతుగా గురువారం విజయవాడ నోవోటల్ నుంచి మంగళగిరి ఏసీఏ క్రికెట్ స్టేడియం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 100 మంది బైకర్లతో నిర్వహించిన ఈ ర్యాలీలో డబ్యూఏపీఎల్ ట్రోఫీని ప్రత్యేక వాహనంలో స్టేడియానికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఏసీఏ తరఫున ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో ఫ్రాంచైజీ విధానం లేకుండా ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించామని, ప్రస్తుతం తొలిసారిగా ఫ్రాంచైజీ మోడల్‌లో నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతిభ ఉన్న పేద, ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారిణులకు మెరుగైన అవకాశాలు, ఆర్థిక సహాయం అందేలా ఫ్రాంచైజీ మోడల్ ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళా క్రికెటర్లకు పోటీ వాతావరణం, గుర్తింపు, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలను కల్పించడమే డబ్యూఏపీఎల్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మంగళగిరి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో డే అండ్ నైట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ఎంపీ చిన్ని తెలిపారు. మహిళా క్రికెట్‌పై మరింత అవగాహన పెంచేందుకు, ప్రజల మద్దతు కూడగట్టేందుకు బైక్ ర్యాలీ నిర్వహించామని చెప్పారు. బైకర్లతో కలిసి సెల్ఫీ వీడియోలు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ప్రస్తుత డబ్యూఏపీఎల్ నాలుగు జట్లు పాల్గొంటున్నాయని, భవిష్యత్తులో లీగ్‌ను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చే ఔAPL పోటీలను కడప, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. మహిళా క్రికెట్‌కు ఏసీఏ అండగా నిలుస్తుందని, ప్రతిభ ఉన్న క్రీడాకారిణులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు. మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ‘బైక్స్ అండ్స్ బ్యాట్స్`ఉమెన్ ఆన్ వీల్స’ బైక్ రైడ్‌లో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “మా మ్యాచెస్ ఎవరూ వ్యూ చేయట్లేదు” అంటూ మహిళా క్రికెటర్లు నిరుత్సాహపడకుండా, తమ ఆటతో జనాలను తమవైపు తిప్పుకున్న ఘనత భారత మహిళా క్రికెటర్లదని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తోందని తెలిపారు. భారత క్రికెట్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళలు ఉండాలనే ఉద్దేశంతో విమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన మహిళా క్రికెట్ ప్లేయర్లను నాలుగు జట్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గోదావరి, అమరావతి, వైజాగ్, రాయలసీమ జట్లు పోటీపడనున్నాయని పేర్కొన్నారు. ద్వారా మహిళలకు ఔAPL ఒక మంచి వేదికగా నిలుస్తుందని శైలజ అన్నారు. మహిళలు తమ ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు, ఇక్కడ బాగా ఆడే క్రీడాకారిణులకు ఇండియా తరఫున కూడా అవకాశాలు రావడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ జట్లలో కొంతమంది భారత ప్లేయర్లు కూడా ఉన్నారని, శ్రీచరణి, రాయలసీమలో అనుషతో పాటు వైజాగ్ జట్టులో కూడా ఒక భారత ప్లేయర్ ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కళ్యాణ్ కృష్ణ, సీఏఓ జై కిషన్, ఏసీఏ సిబ్బంది, బైకర్లు, క్రికెట్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు