విశాలాంధ్ర-విజయవాడ స్పోర్ట్స్ :ఎన్టీఆర్ జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని పిబి.సిద్ధార్ధా కళాశాలలలో సాధన చేస్తున్న కబడ్డీ క్రీడాకారులకు ఎస్‌పి.స్పోర్ట్స్ అధినేత ప్రసాద్ శుక్రవారం స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన క్రీడాకారులనుద్ధేశించి నిత్యం సాధన చేస్తున్న క్రీడాకారులకు తన వంతు సహాయంగా ఈ స్పోర్ట్స్ కిట్స్‌ని అందజేసినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ క్రీడగా పిలవబడే కబడ్డీ ఆట సాధన చేయడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా రాణించటమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. పాపులర్ షూమార్ట్ అధినేత చుక్కపల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి యల్లారావు, ఎస్ఎస్‌టి స్టీల్స్ ప్రొప్రైటర్ ఇమ్రాన్, ప్రముఖ న్యాయవాది కొక్కిరిగడ్డ స్టాలిన్, ఎన్టీఆర్ జిల్లా శాప్ కబడ్డీ కోచ్ కాకర్లమూడి జగదీష్, జిమ్ ట్రైనర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
శాప్ కబడ్డీ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ
- Advertisement -
RELATED ARTICLES


