Homeఆంధ్రప్రదేశ్పవర్‌బాయ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

పవర్‌బాయ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

- Advertisement -

విశాలాంద్ర`విజయవాడ (లబ్బీపేట) : పవర్‌బాయ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో రాణిగారి తోటలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు పవర్‌బాయ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ కమిటీ సభ్యులు కె.స్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి గద్దె క్రాంతికుమార్, 17వ డివిజన్ అధ్యక్షురాలు రాయి రంగమ్మ హాజరయ్యారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పవర్‌బాయ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినంధించారు. ప్రతి ఏటా ఇదే విధంగా నిర్వహించి ఆ గణేషుడి అనుగ్రహం పొందాలన్నారు. ఉత్సవాలను నిర్వహించటమే కాదని పోలీసు వారి సలహా సూచనలను పాటించాలన్నారు. నిమజ్జన సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత వరకు ఎకో ఫ్రెండ్సీ గణపతి ప్రతిమలను పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె.అభి, కె.నాగరాజు, ఎమ్.దిలీప్‌కుమార్, ఎస్.రాజ్‌కుమార్, కె.శ్యామ్‌ప్రసాద్, కె.తరుణ్, వై.ప్రసాద్, కె.గోపి, ఎస్.మహేష్, ఎస్.రమేష్, జి.ప్రవీణ్‌కుమార్, జి.జశ్వంత్‌కుమార్, కె.పవన్, జి.మణికంఠ, బి.దినేష్‌కుమార్, ఎ.అన్వేష్ చందు, పి.ఈశ్వర్, ఆర్.నాగేంద్ర, డి.నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు