Homeజిల్లాలుఅనంతపురంకుటుంబ కలహాలు.. భర్తపై భార్య దాడి..చికిత్స పొందుతూ భర్త మృతి..

కుటుంబ కలహాలు.. భర్తపై భార్య దాడి..చికిత్స పొందుతూ భర్త మృతి..

- Advertisement -

విశాలాంధ్ర–కళ్యాణదుర్గం టౌన్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పదునైన ఆయుధంతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన భర్త చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. చాపిరి గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (67) గురువారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఇంటి ముందు నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాల నేపథ్యంలో అతని భార్య కుమ్మరి రత్నమ్మ (55) పదునైన ఆయుధంతో నాగరాజు తలపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన నాగరాజును స్థానికులు వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 5.50 గంటలకు నాగరాజు మృతి చెందాడు. మృతుడి కుమారుడు కుమ్మరి గుండన్న (39) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణదుర్గం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 115/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) ప్రకారం హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.కుటుంబ కలహాలే ఘటనకు ప్రాథమిక కారణంగా విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు