Homeఅంతర్జాతీయంరష్యాపై అమెరికా కఠిన ఆంక్షలు

రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలు

- Advertisement -

భారత్, చైనాకు టారిఫ్‌ల ముప్పు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆర్థిక ఒత్తిడి మరింత పెంచేందుకు రష్యాపై కఠిన ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే సెనేట్ కూడా బిల్లును భారీ మెజారిటీతో ఆమోదించడంతో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తే ఇది చట్టంగా మారనుంది. రష్యా అధికారులు, బ్యాంకులు, ప్రధాన ఆర్థిక సంస్థలతో పాటు ఇంధన రంగాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లులో కఠిన నిబంధనలు పొందుపరిచారు. ముఖ్యంగా ఆంక్షలను తప్పించుకుని రష్యా చమురు ఎగుమతులకు సహకరిస్తున్న నౌకలపై చర్యలు తీసుకోవడంతో పాటు.. రష్యా ఇంధన ఆదాయాన్ని దెబ్బతీయడమే ప్రధాన లక్ష్యంగా బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లులోని ఓ కీలక నిబంధన భారత్, చైనాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. రష్యా నుంచి చమురు లేదా సహజ వాయువు దిగుమతి చేసుకునే ప్రధాన దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షడికి కల్పిస్తోంది. రష్యా చమురును భారీగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్, చైనా ముందువరుసలో ఉన్నాయి. అయితే బిల్లు చట్టంగా మారిన వెంటనే భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు అమలవుతాయని అర్థం కాదు. ఈ అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు వినియోగించినప్పుడే సుంకాలు అమల్లోకి వస్తాయి. ఒకవేళ ట్రంప్ కఠినంగా ఈ నిబంధనలను అమలు చేస్తే… భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. రష్యా ఇంధన దిగుమతులను తగ్గించే చర్యలు చేపట్టే కొన్ని దేశాలకు మినహాయింపులు కల్పించే వెసులుబాటు కూడా బిల్లులో ఉంది. దీంతో భారత్ విషయంలో అమెరికా తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు