Homeఅంతర్జాతీయంయుద్ధాన్ని వ్యతిరేకించిన అమెరికన్లు: ఇరాన్

యుద్ధాన్ని వ్యతిరేకించిన అమెరికన్లు: ఇరాన్

- Advertisement -

తెహ్రాన్: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలను ఇరాన్ స్వాగతించింది. యుద్ధానికి అమెరికన్లు సైతం వ్యతిరేకించారని తాజా ఫలితాలు స్పష్టం చేసినట్లు వెల్లడించింది. ఈ పరిణామం క్రమంలో తమ దేశం విషయంలో అమెరికా తీరు మారుతుందని ఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీ ఆకాంక్షించారు. అయినప్పటికీ అప్రమత్తంగానే ఉండాలని ఇరాన్ పౌరులకు సూచించారు. అమెరికా మళ్లీ భీకర దాడులతో విరుచుకుపడే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. ఇరాన్ ప్రజలకు అమెరికా వైఖరి పూర్తిస్థాయిలో అర్థమైందని మొజ్తాబా బుధవారం ఓ ప్రకటన చేశారు. అమెరికా దాడులు చేస్తే తీవ్ర ప్రతిస్పందన తప్పబోదని హెచ్చరించారు. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేస్తామని స్పష్టంచేశారు. అలాగే హోర్మూజ్ జలసంధిపై పట్టు సాధించగలమన్న ఆశలను అమెరికా వదులుకోవాలని సూచించారు. అమెరికా ఫలితాలు ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ప్రజా తీర్పు అని ఇరాన్ నాయకులు వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలను స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. యుద్ధం వద్దంటూ అమెరికన్లు ఇచ్చిన సందేశాన్ని సమర్థిస్తున్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు