అర్నాబ్, మురసు తుపాన్ల ప్రభావంపై ఆరా
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం ఫోన్ చేశారు. వారం రోజుల వ్యవధిలో రాష్ట్రానికి రెండు తుపాన్ల తాకిడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్నాబ్, మురసు ప్రభావం… ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లిందని సీఎం చెప్పారు. రహదారులు, విద్యుత్ సరఫరా సహా వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తుపాను సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేసిందని ప్రధాని అభిప్రాయపడ్డారు.


