Saturday, December 6, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న సొసైటీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న సొసైటీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సొసైటీ లో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న సొసైటీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం స్థానిక బస్టాండ్ ఆవరణంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ పెద్దకడబూరులోని సొసైటీలో యూరియా ధరలను సొసైటీ కార్యదర్శి మురళీధర్ రెడ్డి అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం యూరియా ధర 266 రూపాయలు ఉంటే 280 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. పెద్దకడబూరు రైతులకు ఒక్కో రైతుకు మూడు బస్తాలు మాత్రమే ఇస్తూ బనవాసి రైతులకు 30-40 బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీంతో పెద్దకడబూరు రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వేరే గ్రామాలకు తరలిస్తున్నారన్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సొసైటీ కార్యదర్శి మురళీధర్ రెడ్డిపై చర్యలు తీసుకొని బదలీ చేయాలాని లేని పక్షంలో సొసైటీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి దస్తగిరి, నాయకులు కల్లుకుంట వీరేష్, రమేష్, ఆంజనేయులు, బల్ల ఆంజనేయ, ఉరుకుందు, మూకన్న, నరసప్ప, వెంకటేశ్, తాయన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు