Monday, February 9, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాజీమార్గమే రాజ మార్గం

రాజీమార్గమే రాజ మార్గం

- Advertisement -

జాతీయాలోక్ అదాలతో 265 కేసులు పరిష్కారం..

సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు.
విశాలాంధ్ర ధర్మవరం;; రాజీమార్గమే రాజమార్గమని, జాతీయ లోక్ పదాలతో 265 కేసులు పరిష్కరించడం జరిగిందని సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఇంచార్జ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి నందిని, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి మురళి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ లోక్ పదాలతో ఇచ్చిన తీర్పు తుది తీర్పు అవుతుందని వారు తెలిపారు. అంతేకాకుండా కొన్ని కేసులను రాజీ చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి జాతీయాలోక్ అదాలత్ కార్యక్రమాన్ని పోలీసులు, కచ్చిదారులు, న్యాయవాదులు సద్వినియోగం చేసుకున్నప్పుడే విజయవంతం అవుతుందని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం డబ్బు రూ.7,83,440 (బ్యాంకు, జరిమానా, ఎక్సైజ్, ఎన్ ఐ యాక్ట్) కోర్టుకు రావడం జరిగింది అన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో సివిల్ కేసులు 02, క్రిమినల్ కేసుల 92, ఎక్సైజ్ కేసులు 29, ఎన్ ఐ యాక్ట్ 12 కేసులు, పి ఎల్ సి కేసులు 9, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లోని కేసులు 121 మొత్తం వెరసి 265 కేసులు పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేసిన న్యాయవాదులకు కోర్టు పరిధిలోని వివిధ మండలాల పోలీసులకు, కక్షిదారులకు ,జడ్జీలు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కరీం, కార్యదర్శి డిఎల్ఎన్ మూర్తి, కోశాధికారి అబ్దుల్, సీనియర్ ,జూనియర్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు