Wednesday, February 18, 2026
Homeజిల్లాలుఅనంతపురంభక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలు

భక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : పట్టణంలోని నందలపాడులో సోమవారం భక్త శ్రద్ధలతో ఘనంగా మొహరం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువ జామునే పూల దండలు, పూల చత్రియులతో పీర్ల స్వాములను ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఉదయం ఏడు గంటల సమయంలో పీర్ల సావిడి వద్ద నుండి పీర్ల స్వాములను ఎత్తుకొని ఊరిలోని కాలనీలలో సవారి చేశారు. కాలనీలలో ఇంటింటి వద్ద పీర్ల స్వాములకు ఒక బింద నీళ్లు పోసి, స్వామివారికి చక్కెర, లడ్డు సధింపులు ఇచ్చి ప్రజలు తమ మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం పీర్ల స్వాములు ఊరంతా సవారి చేసి మరల పీర్ల చావడి వద్దకు చేరుకున్నారు. మరల సాయంత్రం ఐదు గంటల సమయంలో పీర్ల చావిడి వద్ద ముజావర్ పీర్ల స్వాములకు సధింపులు ఇచ్చి, పీర్లను ఎత్తుకొని అగ్నిగుండంలోకి దిగి ఊరంతా పీర్ల స్వాములు సవారి చేసి జలదికి వెళ్లిపోయాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు