Wednesday, February 18, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినెమలిని టౌన్ పోలీసులకు అందించిన శారదా నగర్ వ్యక్తులు

నెమలిని టౌన్ పోలీసులకు అందించిన శారదా నగర్ వ్యక్తులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు మార్కెట్ యార్డ్ గోడ నుంచి శనివారం సాయంత్రం శారదా నగర్ లో ఎగరలేక నెమలి కింద పడింది. అక్కడే ఉన్న సరితాన్ షేక్షావలి, షేక్ షేక్షావలి కలిసి ఆ నెమలిని టూటౌన్ పోలీసులకు అందించారు. తదుపరి టూ టౌన్ పోలీసులు ఫారెస్ట్ ఆఫీసర్కు సమాచారాన్ని అందించారు.అనంతరం టూ టౌన్ పోలీసు లోని ఏఎస్ఐ బాబయ్య ఆధ్వర్యంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అక్కులప్పకు అందజేశారు. తదుపరి వారు మాట్లాడుతూ దారితప్పిన ఈ నెమలిని ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అడవిలో వదిలిపెట్టడం జరుగుతుందని తెలిపారు. నెమలిని కాపాడి స్టేషన్ ద్వారా మాకు అందించినందుకు సేక్షావలి ను వారు అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు