Homeజాతీయంనటుడు దర్శన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. హత్య కేసులో బెయిల్ రద్దు

నటుడు దర్శన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. హత్య కేసులో బెయిల్ రద్దు

- Advertisement -

కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీపకు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హత్య కేసులో కర్ణాటక హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఁబెయిల్ మంజూరు, రద్దు అంశాలను మేం పరిశీలించాం. ఈ కేసులో హైకోర్టు నిర్ణయం పూర్తిగా యాంత్రికంగా తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. బెయిల్ మంజూరు చేయడం వల్ల విచారణపై ప్రభావం పడుతుంది, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందిఁ అని జస్టిస్ మహదేవన్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో జస్టిస్ మహదేవన్ రాసిన తీర్పును జస్టిస్ పర్దివాలా కొనియాడారు. జస్టిస్ మహదేవన్ చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఇది అనిర్వచనీయం. నిందితుడు ఎంత పెద్దవాడైనా చట్టానికి అతీతుడు కాదని ఈ తీర్పు స్పష్టం చేస్తుందిఁ అని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు