విశాలాంధ్ర – సీతానగరం: ఏటిగట్టు పై నుంచి పొలంలోకి దూసుకువెళ్లిన బోలెరో వాహనం. బుదవారం సీతానగరం నుండి పురుషోత్తపట్నం వెళుతున్న బొలెరో వాహనం రామచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఒక్క సారిగా అదుపుతప్పి ఏటిగట్టు క్రింద ఉన్న పొలంలోకి దూసుకువెళ్ళింది. ఈ సమయంలో డ్రైవర్ తప్పా ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే కొన్ని సవంత్సరాలుగా అధ్వానంగా మారిన ఏటిగట్టు రోడ్డు గోతులు మయంగా మారి అనేక ప్రమాదాలకు కారణం అవుతుంది అని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల్లో క్రితం ఈ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగినా పనులు ముందుకు సాగక పోవడం పై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరలా వర్షాలు ప్రారంభం కావడంతో రోడ్డు నిర్మాణం సాగే అవకాశం లేదు. దీనికితోడు ఈ వర్షాలకు ఈ రోడ్డు పై మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు భయబ్రాంతులు వ్యక్తం చేస్తున్నారు.
ఏటిగట్టు పై నుంచి పొలంలోకి దూసుకువెళ్లిన బోలిరో
- Advertisement -
RELATED ARTICLES


