విశాలాంధ్ర – జేఎన్టియుఏ:ఐ ఎస్ టి ఈ ఏపీ సాంకేతిక విద్య ప్రమాణాలు, ఉపాధి కల్పనలో మైలురాయి అని నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ డాక్టర్ పొట్లూరి రవీంద్ర బాబు,సెక్రటరీ ప్రొఫెసర్ బి. ఈశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మిట్స్ కళాశాలలో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆంధ్ర ప్రదేశ్ స్టూడెంట్ చాప్టర్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రొఫెసర్ బి. ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ .. సాంకేతిక విద్య యొక్క ప్రాముఖ్యతను , భావితరాలు ఇంజనీర్లు , సాంకేతిక నిపుణులను రూపొందించడంలో ఐ ఎస్ టి ఈ పాత్ర స్ఫూర్తిదాయకమని, విద్యార్థులకు వారి జ్ఞానం, నైపుణ్యాలు , నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. టెక్నికల్ వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు , శిక్షణా సెషన్‌లలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు ఇంజనీరింగ్ , టెక్నాలజీ రంగాల్లోని తాజా పోకడలు , సాంకేతికతలపై అప్‌డేట్‌గా ఉండగలరు అని ఆయన అన్నారు. . కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ మాట్లాడుతూ ఐ ఎస్ టి ఈ సభ్యులు కు జర్నల్‌లు, ప్రచురణలు , ప్రత్యేకమైన వెబ్‌నార్లతో సహా విద్యార్థులకు సాంకేతికత మరియు ఇంజనీరింగ్ విద్య రంగంలో నిపుణులు , పరిశోధకుల అనుభవాల నుండి నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తాయి అని అన్నారు. జాతీయ-స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాలు, ఆవిష్కరణ మరియు పరిశోధనలను ప్రోత్సహించడం మొదలైన ఎన్నో ప్రయోజనాలు ఐ ఎస్ టి ఈ స్టూడెంట్ కు ఉంటాయని ఆయన అన్నారు. కార్యక్రమం లో ఐ ఎస్ టి ఈ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీ దివ్య, విభాగాధిపతులు, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు


