Homeజిల్లాలుఅనంతపురంగూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో అధికారుల ఘోర వైఫల్యం

గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో అధికారుల ఘోర వైఫల్యం

- Advertisement -

భక్తుల సౌకర్యాలు గాలికొదిలి.. ప్రచార ఆర్భాటాలకు పెద్దపీట

విశాలాంధ్ర – నార్పల: – శతాబ్ది బ్రహ్మోత్సవాల పేరుతో భారీ ప్రచారం చేసుకున్న గూగూడు కుళ్లాయి స్వామి ఆలయ అధికారులు, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వేలాది మంది భక్తులు తరలివస్తున్నప్పటికీ తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు వంటి మౌలిక వసతులు సక్రమంగా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉత్సవాలకు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఘనంగా ప్రకటించిన అధికారులు, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని విమర్శిస్తున్నారు.భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించాల్సిన చోట నాసిరకం భోజనం అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధుల్లో ఉన్న సిబ్బందికే సరైన భోజనం అందించలేని పరిస్థితి ఉంటే, భక్తుల పట్ల అధికారుల చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.మరోవైపు ఆలయ పవిత్రతను కాపాడాల్సిన అధికారులు, ఆలయ ప్రాంగణాన్ని ప్రకటనల వేదికగా మార్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుళ్లాయి స్వామి, ఆంజనేయస్వామి ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణల్లో వ్యాపార సంస్థల పేర్లు, ప్రకటనలు, ప్రచార సందేశాలు స్క్రోలింగ్ డిస్‌ప్లేల్లో ప్రదర్శించడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తమవుతోంది.దైవ కార్యక్రమాల కంటే వ్యాపార ప్రకటనలకే ప్రాధాన్యత ఇస్తున్నారా? ఆలయ మహిమను చాటాల్సిన పవిత్ర ప్రాంగణాన్ని ప్రచార కేంద్రంగా మార్చడం ఎంతవరకు సమంజసం? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భక్తుల సౌకర్యాలు, ఆలయ పవిత్రత, ఉత్సవాల నిర్వహణ – ఈ మూడు అంశాల్లోనూ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని స్థానికులు మండిపడుతున్నారు.ప్రెస్‌మీట్‌లలో ఆలయ అధికారులు గొప్పలు చెప్పడం తప్ప, భక్తులకు ఉపయోగపడే చర్యలు ఎక్కడా కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన కుళ్లాయి స్వామి ఉత్సవాలను అధికారులు నిర్లక్ష్యానికి బలిచేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఉత్సవాల నిర్వహణలో జరిగిన లోపాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు