Homeజిల్లాలుఅనంతపురందేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం

దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం

- Advertisement -

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని జిల్లాఎస్.పి.
జగదీష్ తెలిపారు.
శుక్రవారం ఉదయం స్థానిక ఆర్ట్స్ కాలేజి ఎగ్జిబిషన్ మైదానంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేకదినోత్సవంసందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం మరియు విభిన్న ప్రతిభా వంతుల శాఖ , ఈగల్ విభాగం సంయుక్తంగా ప్రజా చైతన్యఅవగాహనకార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్.పి. జగదీష్, డిఎల్ఎస్ఎ సెక్రటరీ జడ్జి రాజశేఖర్, జిల్లారెవెన్యూ అధికారి మాలోల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఎస్.పి. జగదీష్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైనపాత్రపోషిస్తుందని అందువల్ల మాదక ద్రవ్య రహిత భారత దేశ ప్రచారంలో గరిష్టసంఖ్యలోయువతచేరడం చాలా ప్రధానమని పేర్కొన్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా యొక్క ఈ సవాల్ ను ఎదుర్కోవడానికి ఈరోజు మనమందరంకలిసినషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజల్లో ఒక మంచి మార్పు రావాలనే సంకల్పంతో ప్రయత్నించడం జరుగు తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా లీగల్ సర్వీసెస్
అథారిటీ సెక్రటరీ జడ్జి రాజశేఖర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలదుర్వినియోగంచట్టరీత్యానేరమనియువత మత్తు మాని జీవితాన్ని గెలవాలని పిలుపునిచ్చారు.
జిల్లా రెవెన్యూ అధికారి మలోలమాట్లాడుతూ డ్రగ్స్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలా సమాచారాన్ని అందరికీ తెలిసే విధంగా సమాజంలోని ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.పిలు నాగభూషణం, ఇలియాస్, మహబూబ్ బాషా ,విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారి అర్చన, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్,డి ఐ పి ఆర్ ఓ బాలకొండయ్య, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ, ఆర్ ఐ ఓ వెంకటరమణ నాయక్, ఇన్చార్జ్ డిఇఓ శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కుముదా ఆన్ సెట్ మేనేజర్ శ్రీనివాసులు, పోలీసు , ఈగల్ విభాగం, మెడికల్ ఎక్సైజ్ శాధికారులు, పలువురు రు జిల్లా అధికారులు ఉపాధ్యాయులు ఆర్ట్స్ మరియు జూనియర్ కాలేజీ, కె ఎస్ ఆర్ స్కూల్, నలంద కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు