నేడే తొలి టీ20…సాయంత్రం 6 నుంచి మ్యాచ్ ప్రారంభం
క్రీడలు: ఐపీఎల్లో అదరగొట్టాడు… శ్రీలంకతో జరిగిన ఇండియా ఏ ట్రై`సిరీస్‌లో దుమ్మురేపిన యువ చిచ్చర పిడుగు అదే ఊపుతో ఇప్పుడు టీ 20 కోసం ఐర్లాండ్‌లో అడుగు పెట్టాడు. టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్న ఈ యువ సంచలన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ…అరంగేట్రం కోసం ఆతృతగా ఉన్నాడు. ఆయన కంటే క్రికెట్ అభిమానులూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పదిహేనేళ్ల కుర్రాడికి తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభిస్తుందా? లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా ఉంది. ప్రస్తుతం టీమఇండియా మేనేజ్మెంట్ ముందున్న అతిపెద్ద చిక్కుముడి ఇదే. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ శుక్రవారం (నేడు) జరగనుంది. వైభవ్ ఆట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వైభవ్‌కు చోటు దక్కాలంటే…
వైభవ్‌కి చోటు కల్పించాలంటే…బ్యాటింగ్ ఆర్డర్లో టాప్-3లో ఉన్న సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లలో ఒకరిని తప్పించాలి. లేదంటే ఇందులో ఒకరిని మూడో స్థానానికి పంపి…మరొకరిని బ్యాటింగ్ ఆర్డర్లో కిందకు పంపాలి. చివరగా టీ20లో టీమఇండియా ఆడిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఈ ముగ్గురు అర్ధసెంచరీలు చేసి జట్టుకు టైటిల్ అందించారు. పైగా టాప్-3లో నిలకడగా రాణిస్తున్నారు. వైభవ్‌ను మిడిలార్డర్లో ఆడించే పరిస్థితి లేదు. వీరిలో ఒకరు అతడి కోసం స్థానం త్యాగం చేయకతప్పని పరిస్థితి నెలకొంది. నాలుగో స్థానంలో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అయిదో స్థానంలో తిలక్‌వర్మ రావడం ఖాయం కాబట్టి…ఒకవేళ శాంసన్‌ను ఆర్డర్లో కిందకు పంపాలంటే ఆరో స్థానంలో ఆడించాలి. కానీ సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులో లేని నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ను ఆడించడానికే టీమ్‌మేనేజ్‌మెంట్ మొగ్గు చూపొచ్చు. అలాంటి సందర్భంలో శాంసన్, అభిషేక్, ఇషాన్‌లలో ఒకరిని తప్పిస్తే కానీ వైభవ్‌కు తుది జట్టులో చోటు లభించకపోచ్చు. మరి గంభీర్ బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఐర్లాండ్‌లో ‘వైభవ’కు చోటు దక్కునుందా?
- Advertisement -
RELATED ARTICLES


