Friday, May 30, 2025
Homeజిల్లాలుఅనంతపురంవ్యవసాయ పరికరాలు, సూక్ష్మ పోషకాలు, అందించాలి

వ్యవసాయ పరికరాలు, సూక్ష్మ పోషకాలు, అందించాలి

రాష్ట రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య

విశాలాంధ్ర అనంతపురం : వ్యవసాయ పరికరాలు, సూక్ష్మ పోషకాలు, అందించాలని రాష్ట రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య పేర్కొన్నారు. సోమవారం ఏపీ రైతు సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులు చిన్నప్ప యాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య పాల్గొన్నారు. సందర్భంగా కాటమయ్య మాట్లాడుతూ… ఖరీఫ్ సీజన్ లో పండించే పంటలకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, అన్నదాత సుఖీభవ అందించాలన్నారు. వ్యవసాయ పరికరాలు, సూక్ష్మ పోషకాలు, అందించాలని
జూన్ మొదటి వారం నుండి ఖరీఫ్ ప్రారంభం అవుతుందన్నారు. జిల్లాలో ఇంతవరకు పంటల వారీగా ప్రణాళికలు, క్రెడిట్ ప్రణాళికలు, విత్తన ప్రణాళికలు ప్రకటించలేదన్నారు. సబ్సిడీ విత్తనాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నారు . జిల్లాలో 90 శాతం కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. వీరికి ఇంతవరకు కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయలేదన్నారు . దీనివల్ల కౌలురైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని కేంద్ర,రాష్ట,అన్ని రకాల పంటల విత్తనాల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. విత్తనాల ధరలు పెరగడంతో పాటు నాణ్యతలేని విత్తనాలను బయట మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారన్నారు. చదువు లేని రైతాంగ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కల్తీ, నకిలీ విత్తనాలు రైతాంగానికి అంటగట్టడం వల్ల రైతన్న తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జిల్లా రైతు సంఘం అద్యక్షులు డి.చిన్నప్పయాదవ్ మాట్లాడుతూ… నాణ్యతలేని విత్తనాలు అమ్ముతున్న షాపులలో ఇటీవల కాలంలో మన జిల్లాలో ఎక్కడా కూడా తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇంత వరకు అమలు కాలేదన్నారు. అనంతరం కలెక్టరేట్లోని ఏవో అలెగ్జాండర్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అర్గనెైజీంగ్ సెక్రటరీవన్నారెడ్డి, జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు టి నారాయణస్వామి, వెంకట రాముడు యాదవ్, కౌలు రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వి. టి. రామాంజనేయులు, సనప రామకృష్ణ, జిల్లా రైతు సంఘం నాయకులు చలపతి, రామాంజనేయులు యాదవ్, లలితమ్మ, మధు యాదవ్, సిపిఐ రూరల్ నాయకులు రమేష్, రాము, చేనేత మధు, చికెన్ భాష, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు