- Advertisement -
విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) బీసీ ఉద్యమ నేత, శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ ఐలాపురం వెంకయ్య మృతికి బీసీ చైతన్య సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిటికెన రమేష్ ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఐలాపురం వెంకయ్య ఆయన రాజకీయ జీవితంలోనూ ప్రజా జీవితంలోనూ అజాతశత్రువుగా ఉన్నారని, సమాజంలో ఉన్న అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్లారని, ఆయన మృతి బీసీ సామాజిక వర్గాలకే తీరనిలోటని పేర్కొన్నారు. నేటి రాజకీయ నాయకులు వెంకయ్య మార్గంలో నడవాలని విలువల పాటించాలని రమేష్ తెలిపారు.


