Homeజిల్లాలుశ్రీ సత్యసాయిముగిసిన షూటింగ్ బాల్ క్రీడా పోటీలు.. పిఈటి లక్ష్మీనారాయణ

ముగిసిన షూటింగ్ బాల్ క్రీడా పోటీలు.. పిఈటి లక్ష్మీనారాయణ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో ఈనెల 13వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు మూడు రోజులపాటు 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు ఘనంగా నిర్వహించుకున్నా మనీ పిఈటి. కె. లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ షూటింగ్ బాలులో 12 జిల్లాలు అయినా వైజాగ్, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, కర్నూల్, నంద్యాల ,అనంతపురం, సత్యసాయి ,ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలు పాల్గొనాలని తెలిపారు. ఈ షూటింగ్ బాల్ అండర్ 17 బాలురు, బాలికల ఆడడం జరిగిందన్నారు. అన్ని జిల్లాల నుంచి హెడ్మాస్టర్లు, పీఈటీలు పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. తొలి రోజు ఈ క్రీడా పోటీలకు ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ చైర్మన్ ప్రసాద్, జనరల్ సెక్రెటరీ జోసఫ్ పాల్గొని ప్రారంభించడం పట్ల వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. చివరి రోజున బాలికల విభాగంలో శ్రీ సత్యసాయి జిల్లా మొదటి స్థానం కైవసం చేసుకోగా, బాపట్ల జిల్లా ద్వితీయ స్థానం, అనంతపురం జిల్లా తృతీయ స్థానం గెలుపొందారని తెలిపారు. అదేవిధంగా బాలుర విభాగంలో అనకాపల్లి జిల్లా ప్రథమ స్థానం, వైజాగ్ జిల్లా రెండవ స్థానం, బాపట్ల జిల్లా మూడవ స్థానాన్ని విజేతలు కావడం జరిగిందన్నారు. విజేతలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పరిసే సుధాకర్ అచ్యుత నారాయణ, ధనుంజయ నాయుడు చేతుల మీదుగా బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి ప్రత్యేకంగా అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఈటి లక్ష్మీనారాయణ తో పాటు ప్రసన్నలక్ష్మి, స్వర్ణలత ,శివ జ్యోతి, పూల ప్రసాద్, సుహాసిని తోపాటు వివిధ జిల్లాల క్రీడా విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు