Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ

ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ

- Advertisement -

2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో చేనేతలకు తీవ్ర అన్యాయం


విశాలాంధ్ర ధర్మవరం;; 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో చేనేతలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యంతో వివక్షతతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని, మొన్న ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో కేంద్రం చేసిన అన్యా యాన్ని మరవకముందే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అన్యాయాన్ని కొనసాగించడం దారుణం అన్నారు.
వ్యవసాయం తర్వాత అత్యంత కీలకమైన చేనేత రంగం అనేకమందికి ఉపాధి కలిగించే ఈ వ్యవస్థకు రాష్ట్ర బడ్జెట్లో కూడా పట్టించుకోకపోవడం తీవ్ర అసహనానికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే చేనేతరంగానికి రాష్ట్ర బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించాలని వాస్తవిక ఆధారాలతో విన్నవించినప్పటికీ వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదు అని వారు దుయ్యబట్టారు.. 3, 32,204 కోట్ల రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో చేనేతలకు 115 కోట్లు మాత్రమే కేటాయించడం చాలా దారుణం అని అన్నారు. సత్యసాయి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్ర బడ్జెట్ లో చేనేతకు నిధులు నిధులు తీసుకురావడం లో విఫలమయ్యారు అని మండిపడ్డారు..ఇది ఇలా ఉండగా యూనిట్ మాల్కో కు 86 కోట్లు ప్రకటించడం జరిగింది అని,ఈ విధంగా ఫిబ్రవరి 22వ తారీకు మంగళగిరిలో జరగబోయే చేనేత గర్జనలో ప్రభుత్వ చర్యలను ఐక్య కార్యాచరణ కమిటీగా మేమందరం కలిసి చేనేత గర్జన వేదికగా ప్రతిఘటిస్తాo అని తెలిపారు.గత జాతీయ చేనేత దినోత్సవం నాడు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా ముఖ్యమంత్రి ప్రకటించిన 25 వేల రూపాయల నేతన్న భరోసా పథకానికి కూడా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆప్కో ప్రభుత్వం నుంచి చేనేత సహకార సంఘాలకు రావలసిన 203 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలని కోరినా దాని గురించి ప్రస్తావించలేదు అని తెలిపారు. త్రిఫ్ట్ ఫండ్ పథకం కింద 17. 7 కోట్లు రావాల్సి ఉండగా కేవలం 5 కోట్లు కేటాయించడం దారుణమని తెలియజేశారు. కావున చేనేతకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం గుర్తించి చేనేత రంగానికి కేటాయింపులు చేయాలని వారు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు