Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక.. అధ్యక్షులు వడ్డే బాలాజీ

జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక.. అధ్యక్షులు వడ్డే బాలాజీ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్ డి టి ధర్మవరం క్రీడాకారుడు అండర్-12 జిల్లా క్రికెట్ జట్టుకు గోవర్ధన్ ఎంపిక కావడం జరిగిందని ఆర్డిటి ఏరియా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసులు, ధర్మవరం మండల క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డే బాలాజీ, కార్యదర్శి శివ శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ధర్మవరంలోని ఆర్‌డిటి స్పోర్ట్స్ సెంటర్‌లో ప్రాక్టీస్ చేస్తున్న 11 ఏళ్ల జెన్నీ గోవర్ధన్ అండర్-12 జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడని, ఈ జట్టు కడప జిల్లాకు ప్రయాణిస్తోంది అని తెలిపారు. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 16, 2025 నుండి ప్రారంభమవుతుంది అని తెలిపారు. అండర్-12 జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన గోవర్ధన్‌ను ఆర్ డి టి ఏరియా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసులు, ధర్మవరం మండల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్డె బాలాజీ , కార్యదర్శి శివశంకర్, కోచ్ రాజశేఖర్ అభినందించారు. క్రికెట్ లేదా మరే ఇతర క్రీడలలో అయినా యువ క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆర్ డి టి గొప్ప పని చేస్తోందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు