విశాలాంధ్ర ధర్మవరం;; మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని రామ్ నగర్ లో గల శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సమేత జల లింగేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి , సతీమణి ఛాయాదేవి తో కలిసిఆలయానికి వెళ్లి అర్చకులు ద్వారా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అక్కడే కొంత సమయమును గడిపి దేవాలయ వాతావరణాన్ని ఆస్వాదించి ఆలయ ప్రాంగణంలో భక్తులతో కాసేపు మమేకమయ్యారు. తదుపరి ఆలయ అభివృద్ధి కోసం దంపతులు ఆలయ కమిటీ వారికి రూ.10,016 రూపాయలను విరాళంగా అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ వారు దంపతులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలను తెలియజేశారు.
ఆలయానికి విరాళం అందించిన చిలకం మధుసూదన్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES


