Saturday, May 3, 2025
Homeజిల్లాలుకర్నూలుఘనంగా ఏఐవైఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

ఘనంగా ఏఐవైఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు శనివారం ఏఐవైఎఫ్ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ లు హాజరయ్యారు. ముందుగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిపిఐ మండల కమిటీ సభ్యులు రాజు, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో యువతకు ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను నట్టేట ముంచారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 10 నెలలు కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు మహ్మద్ ఉసేన్, మేకడోన కార్యదర్శి హుస్సేన్ భాష, నాయకులు రాజా రియాజ్, గోపాల్, తిక్కన్న, రెక్కల గిడ్డయ్య, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు