Thursday, December 12, 2024
Homeఆంధ్రప్రదేశ్బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ సహకరించండి

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ సహకరించండి

ఎం ఈ ఓ గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ సహకరించాలని అనంతపురం జిల్లా ఉప కార్మిక కమిషనర్ లక్ష్మీనరసయ్య, ధర్మవరం అసిస్టెంట్ కమిషనర్ సూర్యనారాయణ, ఎంఈఓ లు గోపాల్ నాయక్ ,రాజేశ్వరి దేవిలు తెలిపారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవం పురస్కరించుకొని కార్మిక శాఖ విద్యాశాఖ ఇతర శాఖలు ఎన్జీవోలు కలిసి పట్టణంలోని పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అనంతపురం జిల్లా ఉప కార్మిక కమిషనర్ లక్ష్మీనరసయ్య జండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించినప్పుడే అందరికీ చక్కటి విద్య లభిస్తుందని తెలిపారు. అక్షరాస్యతను సాధించుటలో తల్లిదండ్రులు కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. త్వరలో ధర్మవరం బాల కార్మిక రహిత మున్సిపాలిటీగా ప్రకటించే ఏర్పాటు జరుగుతున్నాయని తెలిపారు. చదువుకునే ప్రతి పిల్లవాడు పాఠశాలలోనే ఉండాలని, డ్రాప్ అవుటుగా మారకూడదని తెలిపారు. ఎక్కడైనా బాల కార్మికులుగా విద్యార్థులను షాపులో గాని, మెకానిక్ షాపులో గాని, పెట్టుకున్నట్లయితే వారిపైన కేసులు నమోదు చేసి జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని విద్యార్థులందరికీ ఉచిత విద్యను అభ్యసించడానికి పాటుపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖలతోపాటు ఎన్జీవోలు, ట్రేడ్ అసోసియేషన్ వర్గాలు, సహాయ కార్మిక అధికారి నరేష్ కుమార్, కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్, రెడీమేడ్ క్లాత్ అసోసియేషన్ అధ్యక్షులు ధనుంజయ, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు