Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య సేవలు ఉచితం..

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య సేవలు ఉచితం..

- Advertisement -

రోగులకు 24 గంటల పాటు వైద్య చికిత్సలు అందిస్తాం..

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య సేవలు ఉచితము అని, 24 గంటల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటూ వైద్య సేవలను అందించడం జరుగుతుందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్షాకాలంలో చిన్నపిల్లలు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తీసుకోవలసిన జాగ్రత్తలను వారు వివరించారు. వర్షాకాలంలో శీతల పానీయాలు, ఫ్రిడ్జ్ లో నిలువ చేసిన నీరు, ఆహార పదార్థాలు ఎటువంటి పరిస్థితుల్లో వాడు రాదని తెలిపారు. అంతేకాకుండా చిన్న పిల్లలకు ఐస్ క్రీములకు దూరంగా ఉంచాలని తెలిపారు. బిపి, షుగర్, రక్త పరీక్షలు తదితర వాటికి పూర్తిగా ఉచితమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా గర్భిణీల పట్ల ప్రత్యేక శ్రద్ధను కూడా కనపరుస్తున్నామని, ప్రసవాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతిరోజు ఏ సమయంలోనైనా ప్రభుత్వాసుపత్రికి వైద్య చికిత్సల కోసం రావచ్చునని, ప్రత్యేకంగా ఆ సమయంలో డ్యూటీ ట్రాక్టర్ వైద్య చికిత్సలను అందిస్తారని తెలిపారు. అంతేకాకుండా ఛాతి నొప్పి, ఎదనొప్పి తదితర వాటికి అనగా హార్ట్ ఎటాక్ లాంటి వాటికి ప్రభుత్వ ఆదేశాల మేరకు 40 వేల రూపాయలు విలువచేసే ఇంజక్షన్లు ఏ సమయంలోనైనా వేయడం జరుగుతుందన్నారు.ప్రభుత్వాసుపత్రిలో ఎవరికీ కూడా లంచం ఇవ్వరాదని తెలిపారు. ప్రతి ఒక్కటి ఉచిత సేవగా అందించడమే మా ధ్యేయము అని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి తమ వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు రోగులకు వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయని, దాతల ద్వారా తాగునీటి సౌకర్యం కూడా కలదని వారు తెలిపారు. రోగులు వైద్య చికిత్సలు పొందిన తర్వాత, డాక్టర్ల సలహా మేరకు మందులను ఎప్పటికప్పుడు వేసుకోవాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కొరకు తాము కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు