Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసుపరిపాలన - తొలి అడుగు కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్

సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్

- Advertisement -


విశాలాంధ్ర -ధర్మవరం: తొలి ఏడాదిలో ప్రజలు చూస్తున్న అభివృద్ధి కొంతేనని.. రానున్న నాలుగేళ్లలో మరింత అభివృద్ధి చూస్తారని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం రూరల్ మండలం చిగిచెర్ల గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు నాగేంద్రతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతి ఇంటి వద్ద శ్రీరామ్ కు మంచి స్పందన కనిపించింది. ప్రస్తుతం అమలవుతున్న పథకాల్లో దాదాపు అన్నీ అందుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ 15వేల రూపాయల చొప్పిన ఆర్థిక సాయం అందిందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో కొందరు రేషన్ కార్డులు లేకపోవడం వలన పథకాలు అందడం లేదన్నారు. వీటిన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ఏడాది పాలన పై అంతటా హర్షం వ్యక్తమవుతోందన్నారు. తాము చేసింది చెప్పుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదని.. ఇంకా చేయాల్సిన వాటి గురించి చెబుతూనే.. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని.. దీని వలన రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కుపోయిందన్నారు. కానీ ఏడాదిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ గాడిలో పెట్టారన్నారు. ఇప్పటికే పోలవరం పూర్తి చేసేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని.. ఈ ఏడాది కాలంలోనే అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయన్నారు. ప్రజలకిచ్చిన అన్ని హామీలు నెరవేర్చడంతో పాటు రాష్ట్రాభివృద్ధి చూస్తారని శ్రీరామ్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు