బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ మేరీ వర కుమారి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల ప్రభుత్వ బిఎస్సార్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 23 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇతర ప్రాంతాలకు బదిలీగా వెళ్లారు. ఆ ఉపాధ్యాయులు బిఎస్ఆర్ స్కూల్లో సేవలు నిర్వర్తించినందున పాఠశాలకు మంచి గుర్తింపు రావడంతో ప్రస్తుత హెడ్మాస్టర్ మేరీ వర కుమారి ఆ 23 మంది ఉపాధ్యాయులను ప్రస్తుత ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ, విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం హెడ్మాస్టర్ మేరీ వర కుమారి మాట్లాడుతూ అప్పటి హెడ్మాస్టర్ రాంప్రసాద్, ఉపాధ్యాయులు చేసిన సేవలను కొనియాడారు. తదుపరి బిఎస్సార్ పాఠశాల యొక్క గొప్పతనాన్ని మేమందరం కూడా మరింత ముందుకు తీసుకెళ్తామని వారు తెలియజేశారు. సత్కరింపబడిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ బిఎస్సార్ పాఠశాల జిల్లా రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు పొందడం మా అదృష్టంగా భావిస్తున్నామని, మేము ఈ పాఠశాలలో విద్యార్థులకు విద్య నేర్పడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. బదిలీగా వెళ్లిన చోట కూడా తాము విశేష సేవలను అందిస్తామని తెలిపారు. ఈ సత్కరణ రోజును తాము మరిచిపోలేమని తెలిపారు.
బదిలీగా వెళ్లిన వారికి ఘనంగా సన్మానం నిర్వహణ..
- Advertisement -
RELATED ARTICLES


