పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;;ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అద్వైర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరం నందు స్కిల్ హబ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రిన్సిపల్ జె.వి. సురేష్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి బి. హరి కృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందులో జూలై 16 నుండి ఎం ఐ ఎస్ డాటా అనాల స్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కోర్సును ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.ఇందుకు పదవ తరగతి, ఇంటర్ పాస్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ ( బి ఎ, బీకాం) చేసి ఆసక్తి కల్గిన యువతీ యువకులు నమోదు చేసుకోవలసిందిగా వారు తెలిపారు. తదుపరి వివరాలకు 9182288465 నంబర్లకు లేదా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యందు నేరుగా సంప్రదించవలసినదిగా వారు తెలిపారు. శిక్షణ అనంతరం వీరికి ఉద్యోగం అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా వారు తెలిపారు.
ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు..
- Advertisement -
RELATED ARTICLES


