ఏపీ చేతి వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో ఈనెల 31వ తేదీన జరిగే సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఏపీ చేతి వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు సిపిఐ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని శివానగర్ శివాలయం దగ్గర నుండి తేరు బజార్,అంజిమాన్, సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్, కళాజ్యోతి ,గా పుర వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట నారాయణ, గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, చెన్నంపల్లి శ్రీనివాసులు, ప్లంబర్స్ కార్మిక సంఘం నాయకులు గోవిందరాజులు, లక్ష్మీనారాయణ,తాజ్, ఆంజనేయులు, సుబ్బు,రామక్రిష్ణ, చిన్న, జనార్దన్,మహిళా సమైక్య లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లాలో చాలా వెనుకబడిన జిల్లా కరువు కోరల్లో నిత్యం నలిగిపోతున్న జిల్లా నిత్యం వలసలు, రైతాంగ ఆత్మహత్యలు జరుగుతున్నటు వంటి జిల్లా ఈ జిల్లాలో అభివృద్ధి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలిపారు. ఈ మహాసభల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాల రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించే దిశగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు . కావున ఈ మహాసభలకు జయప్రదం మీ వంతు ఆర్థిక సాయం అందించి జయప్రదం చేయాలని తెలియజేశారు.


