Tuesday, November 18, 2025
Homeజిల్లాలుకర్నూలుకర్నూలులో జననేతకు ఘన నివాళులు

కర్నూలులో జననేతకు ఘన నివాళులు

- Advertisement -

వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ సీపీ నేతలు కర్నూలులో ఘనంగా జరుపుకున్నారు. కర్నూలులోని స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా జరుపుకొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మణిగాంధీ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని రైతులకు ఆపద్బాంధవుడుగా నిలిచి రైతు బాంధవుడుగా పేరు ప్రగతిలో పొందారని కొనియాడారు. వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ ట్రైన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషన్, జిల్లా న్యాయవాదుల ఉపాధ్యక్షుడు రాజేష్, విజిలెన్స్ మాంటింగ్ కమిటీ మాజీ సభ్యుడు ప్రభుదాస్, రైల్వే ప్రసాద్ నవీన్ ఫిరోజ్ వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు