ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జే రాజారెడ్డి
విశాలాంధ్ర అనంతపురం : మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు రూ. 21వేలు వేతనం ఇవ్వాలిని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె. రాజారెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అనంతపురం నగరంలోని సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జే రాజారెడ్డి మాట్లాడుతూ… అనేక సమస్యల నడుమ మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారు. మున్సిపల్ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు గాని వారి సమస్యలు పట్టించుకోని పాపన పోలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ అనేక హామీలు ఇస్తూ సమ్మె నాటికి అనేక హామీల నెరవేరుస్తానని చెప్పినప్పటికీ ఐదు సంవత్సరాలలో కార్మికులకు ఏం చేయలేదన్నారు. కార్మికులందరూ తమ ఓటు ద్వారా కూటమి ప్రభుత్వానికి అధికారమిచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి సుమారు 6 నెలలవుతున్న సమ్మె కాలంలో ఇచ్చినటువంటి మినిట్స్ లో ఉన్న ఏ ఒక్క హామీని నెరవేర్చ లేదన్నారు. వైసిపి ప్రభుత్వం కార్మికులను విభజించు పాలించు పద్ధతిలో పరిశుద్య కార్మికులకు 21 వేలు ఒక వేతనం,ఇంజనీర్ కార్మికులకు 15వేలు వేతనం అమలు చేశారన్నారు. పనిచేసే కార్మికులందరికి ఒకటే వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పడం జరిగిందన్నారు . ఒక మనిషి భూమ్మీద జీవించడానికి రూ. 26వేలు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రూ. 26జీతం కార్మికుడికి ఇవ్వాలి అని తెలియజేసిందన్నారు . అనంతపురం నగర జనాభా దృష్టిలో పెట్టుకొని కార్మికుల సంఖ్య ను పెంచాలని, కార్మికులకు పని భారం తగ్గించాలని. ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తించాలని, పారిశుద్య కార్మికులకు పనిచేసేందుకు అవసరమైన పనిముట్లు అందజేయాలన్నారు. ఈ ఎస్ ఐ,,పిఎఫ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. స్కూల్ స్వీపర్లు వాచ్మెన్ లను ఫుల్ టైం కంటెంట్ వర్కర్స్ గా తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న 7 నెలలో వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నామన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు జి చిరంజీవి,ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి వేణుగోపాల్, నగర కోశాధికారి శివకృష్ణ, జిల్లా నాయకులు నాగేంద్రబాబు, రామాంజనేయులు,ప్రసాద్, దేవమ్మ,రఫీ,సరస్వతి లక్ష్మీదేవి,సుజాత,రవి, హాసెన్,మాధవ,రాముడు రామాంజనేయులు,వరలక్ష్మి,సమీర్ భాష, వెంకట్ రాముడు తదితరులు పాల్గొనడం జరిగింది.