- Advertisement -
జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సోషల్ మీడియా నుంచి విరామం తీసుకునే నిర్ణయం తీసుకున్నారు.ఆయన కొన్ని పెండింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇకపై ఇతర బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని కూడా తెలిపారు.సామాజిక మాధ్యమం ఎక్స్ లో తరచూ చురుగ్గా ఉండే శ్రీధర్ వెంబు, తన ఈ నిర్ణయాన్ని అదే వేదిక ద్వారా వెల్లడించారు.ఈ వారం తరువాత సోషల్ మీడియా విరామం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.అంత కఠినమైన నియమాలు తనపై తానే విధించుకోవాల్సి వచ్చినందుకు విచారం వ్యక్తం చేశారు. ఇకపై తాను ఆచరించే విషయాలనే పంచుకుంటానని స్పష్టం చేశారు.


