విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నం నగరంలో అడుగుపెట్టడం రాష్ట్ర అభివృద్ధికి చారిత్రక మలుపు అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొల్ల అప్పలనాయుడు అభివర్ణించారు.
మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, నిరంతర కృషి వల్లే గూగుల్ లాంటి అంతర్జాతీయ టెక్ సంస్థ విశాఖలోకి రావడానికి ముందడుగు వేసింది. దీని ఫలితంగా విశాఖ త్వరలోనే దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ టెక్ హబ్‌గా అవతరించనుంది” అని అన్నారు.
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో ఏఐ–టెక్ హబ్, తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ హబ్ ఏర్పాటు వంటి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి కొత్త దిశగా నిలుస్తున్నాయని ఆయన తెలిపారు. “ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువతకు ఇది ఒక ఆశాకిరణం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన ఉద్యోగ కల్పనలో ఇది కీలక అడుగు” అని వివరించారు.
అప్పలనాయుడు మరోసారి స్పష్టం చేస్తూ, “ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కృషి వల్లే గూగుల్ విశాఖకు రాక సాధ్యమైంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కట్టుబడి అమలు చేస్తున్నారనే దానికి ఇది నిదర్శనం”అన్నారు.
సీఎం చంద్రబాబు కృషి, దూరదృష్టే టెక్ హబ్‌గా విశాఖ: కొల్ల అప్పలనాయుడు
- Advertisement -


