Saturday, November 15, 2025
Homeజిల్లాలుఅనంతపురంప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేయాలి….
అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం..
ఎంపి అంబికా లక్ష్మీనారాయణ

విశాలాంధ్ర -అనంతపురం : ప్రభుత్వ ఆసుపత్రులకు వివిధ రకాల వ్యాధులతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. ఆరోగ్య సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యం అని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం ఉదయం అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ మరియుఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఓ. ఆనంద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కమిటీ కో- చైర్మన్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కో – చైర్మన్ పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నెంబర్ కన్వీనర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ కంటెంట్ డా కే .ఎల్. సుబ్రహ్మణ్యం, సభ్యులు డా. రఘునాథన్, శ్రీమతి విశాలా ఫెరర్, రవికాంత్ వెంకటరమణ, గంగారాం, నరసింహులు, రత్నమయ్య, డా. విజయశ్రీ డి ఎం హెచ్ ఓ డా. ఇ. బి .దేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం జ్వరాల సీజన్ ఉన్నందున నిత్యం ఆసుపత్రిలో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలోఆరోగ్య సిబ్బంది కూడా ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం సర్జరీ కేసులకు సంబంధించి నిధుల మంజూరును ప్రస్తావించారు. చాలావరకు రోగుల చెల్లింపుల విషయంలో ఆలస్యమైనట్లు తెలుసుకొని పెండింగ్ లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ ప్రక్రియ వేగవంతం అవుతున్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలో ఆలస్యం అవడానికి కారణాలు గురించి అడిగితెలుసుకున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది ఆరోగ్యశ్రీ కేసులను ఎప్పటికప్పుడు వివరాలను నమోదు పూర్తి చేస్తున్నట్లయితే 100% సత్ఫలితాలు సాధించవచ్చునని తద్వారా చెల్లింపులు కూడా నిర్ణీత సమయానికి వస్తాయని పేర్కొన్నారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పథకం గతంలో నిర్వీర్యంగా అయిందని ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పథకం పటిష్టంగా అమలవుతున్నదని తెలిపారు.
పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నాయని తెలిపారు.
ఈ సమావేశంలో డిసి ఎస్ ఆర్ఎంవో డా.హేమలత, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కిరణ్, సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ సూపరిటెండెంట్డా. బెనా డిక్ట, ఎం ఎస్ ఐ డి సి డి ఇ నవీన్ కుమార్ డా.ఆత్మరామ్, డా. సతీష్, వివిధ వైద్య విభాగాలకు చెందిన అధిపతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు