Sunday, November 16, 2025
Homeజిల్లాలువిజయనగరంమద్యం నాణ్యత తనిఖీ కోసం మొబైల్ యాప్

మద్యం నాణ్యత తనిఖీ కోసం మొబైల్ యాప్

- Advertisement -

విశాలాంధ్ర-రాజాం(విజయనగరం జిల్లా ): విజయనగరంజిల్లా రాజాం ఎక్సైజ్ పరిధిలో గల మద్యం వినియోగదారులకు ముఖ్య విజ్ఞప్తి మీరు మీ సమీపంలో కొనుగోలు చేసిన మద్యం ప్రభుత్వం సరఫరా చేసినదా కాదా అని సులువుగా తెలుసుకోవడానికి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సులభంగా వినియోగించగలిగే మొబైల్ అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే మొబైల్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని కన్జ్యూమర్ అనే టాబ్ పై ఉత్తినట్లయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి వీలు అవుతుంది అప్పుడు మీరు కొనుగోలు చేసినటువంటి మద్యం సీసా మూత పై అతికించబడిన ఉన్న హీల్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసినట్లయితే ఆ సీసా ఎక్కడ తయారైంది ఏ డిపో నుండి సరఫరా చేయబడింది ఏ షాపులో మీరు కొనుగోలు చేశారో వంటి వివరాలు తెలుస్తాయి అలాగే మద్యం సీసా పై గాని బీరు సీసాపై గాని ఉండే వేరే బార్ కోడ్ ను స్కాన్ చేయవద్దు ఆ బార్ కోడ్ కేవలం లేబుల్ కి సంబంధించినది అలాగే బీరు సీసా మీద ఎలాంటి హీల్ ఉండదు ఈ మొబైల్ యాప్ లిక్కర్ సీసా కి మాత్రమే వర్తిస్తుంది లిక్కర్ నాణ్యతకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే 14405 కి గానీ 9000248926 నంబర్ కి తెలియపరచాలని ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఆర్.జై భీమ్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు