ఆర్బిఐ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాలు పీఎం ఎస్బి వై, పి ఎం జె జె బి వై అనే పథకాలపై మండల పరిధిలోని పోతుల నాగేపల్లి గ్రామంలో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని ఆర్.పి.ఐ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి ఎం ఎస్ బి వై అనే పతకంలో వార్షిక ప్రీమియం కేవలం 20 రూపాయలకే రెండు లక్షల రూపాయల ప్రమాదా బీమా లభిస్తుందని, ఈ పథకం 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు గల బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. మీ తర్వాత మీ కుటుంబ సభ్యులకు భీమా సొమ్ము లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా పి ఎం జె జె బి వై పథకంలో వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలకే రెండు లక్షల రూపాయల జీవిత బీమా లభిస్తుందని, ఈ పథకం 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసుగల బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. దుర్ఘటన సాయి వైకల్యం కూడా ఈ బీమాలో ఉంటాయని తెలిపారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన (పి ఎం జె జె బి వై) 2 లక్షల రూపాయలు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పి ఎం ఎస్ బి వై) రెండు లక్షల రూపాయలు, రూపే కార్డు యాక్టివేషన్ కు 450 రూపాయల చెల్లిస్తే రెండు లక్షల రూపాయలు మొత్తం వెలిసి ఆరు లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉందన్నారు. సగటున రోజుకు చెల్లించి ఆరు లక్షల రూపాయలు మీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. ఏపీ వై లో పింఛన్ పొందాలంటే ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉందన్న వివరాలను కూడా నెలవారీగా చెల్లించాల్సిన మొత్తాన్ని వారు వివరించడం జరిగిందన్నారు. కావున యు బి ఐ ఖాతాదారుల సేవా కేంద్రం మీ సమీప బ్రాంచ్ నందు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాము, జిల్లా బీడ్ బ్యాంక్ మేనేజర్ రమణ, బ్రాంచ్ మేనేజర్ విష్ణు, గ్రామ సర్పంచ్ మౌనిక, గ్రామపంచాయతీ కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలపై యూనియన్ బ్యాంక్ వారు గ్రామ ప్రజలకు అవగాహన..
- Advertisement -
RELATED ARTICLES


