- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని గౌరీ శంకర్ అనే భవన నిర్మాణ కార్మికునికి అనుకోకుండా ఇటీవల కరెంటు షాక్ తో ఓ చేయి పూర్తిగా కాలిపోవడం జరిగింది. సమాచారాన్ని అందుకున్న సందా రాఘవ ఆ భవన కార్మికున్ని ఆదుకునేందుకు మరోసారి తన మానవతను చాటుకొని తనవంతుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారు అందించారు. పట్టణములో కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా తన దాతృత్వాన్ని చాటుకుంటూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మంచి గుర్తింపు పొందుతున్నారు.తదుపరి బాధిత కుటుంబ సభ్యులు సందా రాఘవకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జింకా పురుషోత్తం, సాయి కృష్ణ, బేల్దారి మురళి, బిల్డర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.


