పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్
విశాలాంధ్ర ధర్మవరం : కుస్తీ పోటీలలో పట్టణములోని నాగులు గ్రామం వద్ద గల రూపా రాజా పి సి ఎం ఆర్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్, పాఠశాల డైరెక్టర్ రూప రాజా కృష్ణ, జగదీష్, కరెస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరేష్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతరం వారు మాట్లాడుతూ త్వరలో ఎన్టీఆర్ జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలలో ఈ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన వారిలో అండర్ 14 విభాగంలో జి. యశ్వంత్, అండర్ 17 విభాగంలో మదన్, కార్తీక్, దిలీప్, జస్వంత్, లోహిత్, అండర్ 19 విభాగంలో అరుణ్ వశీకరణ శ్రీబ జిల్లా స్థాయిలో జరిగిన కుస్తీ పోటీలలో రాణించి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. కుస్తీ కేవలం ఒక క్రీడా మాత్రమే కాదు అని, అది శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించే ఒక కళ అని తెలిపారు. అనంతరం విద్యార్థులు అందర్నీ కూడా చైర్మన్, కరెస్పాండెంట్, డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
కుస్తీ పోటీలలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన రూపా రాజా పిసీఎంఆర్ పాఠశాల విద్యార్థులు..
- Advertisement -
RELATED ARTICLES


