ఏపీ చేనేత కార్మిక సంఘం శ్రీ సత్యసాయి ప్రధాన జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం ; చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నేతన్న భరోసా 25వేల రూపాయల పథకాలను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హామీ ఇచ్చి 2 నెలలు పూర్తి అయినా కూడా ఇంతవరకు ఆ పథకాలకు సంబంధించి న విధి విధానాలను కూడా ప్రభుత్యం విడుదల చేయలేదు అని తెలిపారు. కావున 200 యూనిట్లు ఉచిత విద్యుత్, నేతన్నా భరోసా పథఖాన్ని వెంటనే అమలు చేసి ఆదుకోవాలని వారు తెలిపారు. చేనేత కార్మికులకు ఉపయోగ పడె మరి కొన్ని డిమాండ్లను ప్రభుత్యం దృష్టికి తీసుకువెళ్లాలని ఆర్డీవోను కోరడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం లో చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యచ్యులు గుర్రం వెంకటస్వామి, చేనేత కార్మిక సంఘం నాయకులు చెన్నంపల్లి శ్రీనివాసులు, ఆదినారాయణ, శ్రీనివాసులు,శివ, బాలరంగయ్య,రాజ, కేశవ తదితరులు పాల్గొన్నారు .
చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయండి..
- Advertisement -
RELATED ARTICLES


