Tuesday, November 18, 2025
Homeజిల్లాలుఅనంతపురంమద్యం దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా ఎక్సైజ్ అధికారులు

మద్యం దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా ఎక్సైజ్ అధికారులు

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ పట్టణంలో బుధవారం మద్యం దుకాణాలను జిల్లా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ బి. రామమోహన రెడ్డి మరియు అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎన్‌ఫోర్స్మెంట్) ఎం. శ్రీరామ్ మాట్లాడుతూ మద్యం దుకాణాల యందు “ఏపి ఎక్సైజ్ సురక్ష” మొబైల్ యాప్ ద్వారా జరుగుతున్న మద్యం బాటిళ్ల విక్రయ చర్యలను పరిశీలించి, బాటిళ్ల విక్రయాలు పూర్తిగా యాప్ ద్వారానే జరపాలన్న సూచనలు ఇచ్చారు. కొనుగోలుదారులు కూడా ఈ “ఏపి ఎక్సైజ్ సురక్ష” యాప్ వినియోగించి తాము కొనుగోలు చేసిన మద్యం బాటిల్ నిజమైనదా కాదా అని సులభంగా ధృవీకరించుకోవచ్చు అని మద్యం దుకాణాల వద్ద పలు వినియోగదారులకు అవగాహన కల్పించారు. “ఏపి ఎక్సైజ్ సురక్ష” యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందని, యాప్‌లోని ‘ కన్స్యూమర్ ’ ఫీచర్ ద్వారా వినియోగదారులు తాము కొన్న మద్యం బాటిళ్ల పైన ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి స్వయంగా మద్యం బాటిల్ ప్రమాణాలను నిర్ధారించుకోవచ్చు అని తెలిపారు. అంతకు ముందు స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ నేరాలపై సమీక్ష నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఉరవకొండ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర, ఎస్సై వీరస్వామి, పోతులయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు