సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం;; డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణం నుండి పలు ట్రాక్టర్లతో ర్యాలీగా ఆర్డీవో కార్యాలయం వద్దకు తమ నిరసనను తెలుపుతూ చేరుకున్నారు. అనంతరం మధు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో ట్రాక్టర్స్ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. గతంలో ఇసుక మట్టిని ప్రభుత్వమే అందించడంతో కార్మికులు ఉపాధి కోల్పోవడం జరిగిందన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉచిత ఇసుక ఇవ్వడం జరిగిందన్నారు.తద్వారా సొంత ఇంటి నిర్మాణం, గుడి నిర్మాణాలకు ఇసుకను తీసుకొస్తుంటే ట్రాక్టర్లను సీజ్ చేయడం ఎంతవరకు సమంజసమని అధికారులను వారు ప్రశ్నించారు. ఈ ప్రాంతం నుండి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాల్లో తరలిస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మేమంతా ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి భవన నిర్మాణాలకు ,వారి తో పాటు భవనకార్మికులకు కూడా ఉపాధినిస్తునారు అని తెలిపారు. కావున ట్రాక్టర్స్ కార్మికుల సమస్యల ను పరిష్కరించాలని తెలిపారు. తదుపరి
ట్రాక్టర్స్ కార్మికుల సమస్యల గురించి ఆర్డిఓ మహేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి రమణ, సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కమతం కాటమయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, ఆదినారాయణ, మహిళా సమాఖ్య లీడర్స్ లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ, ట్రాక్టర్ కార్మికులు రవికుమార్ రెడ్డి, చంద్రమౌళి, మహేష్,లోకేష్ నాగభూషణ నిఖిల్, తేజ, కొండప్ప తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
- Advertisement -
RELATED ARTICLES


