వేరుశనగ పంటలు పరిశీలన చేపట్టిన సిపీఐ ఏపీ రైతు సంఘం బృందం
విశాలాంధ్ర – గుమ్మగట్ట: మండలంలోని 75 వీరాపురం, పూలకుంట, వెంకటంపల్లి, కలుగోడు,రంగచేడు గ్రామాలలో బుధవారం ఏపీ రైతు సంఘం వేరుశనగ పంటలను పరిశీలించారు.నియోజకవర్గ తాలూకా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ వేరుశనగ వర్షాధార భూములను చదును చేసే సేద్యానికి వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని.సకాలంలో వేరుశనగ పంటలపై వర్షాలు రాకపోవడంతో నిట్ట నిలువున భూముల్లోనే ఎండిపోయిన పరిస్థితి ఉందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం పెట్టి కేవలం 20వేలు రూపాయలు విడతల వారీగా ఇస్తే రైతులకు ఏ రకంగా లబ్ధి చేకూరుతుందో కూటమి ప్రభుత్వం చెప్పాలన్నారు . ఏ ప్రభుత్వం వచ్చిన రైతులను ఆదుకోవడంలో పూర్తిస్థాయిలో విఫలం చెందుతున్నారని ఆయన మండిపడ్డారు.ఏపీ రైతు సంఘం తాలూకా కార్యదర్శి తిప్పేస్వామి మాట్లాడుతూ రైతులు అప్పులు చేసి పెట్టిన పెట్టబడులు రాక తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొంటున్నాయని తక్షణమే కరువు బృందం ఏర్పాటు చేసి ఎంత మేరకు వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయో వాటిని అంచనా వేసి పూర్తిస్థాయిలో రైతులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. హెక్టారుకు 60వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పుడు లేని విధంగా వేరుశనగ పంటలు రాయదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా రైతులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉందని. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి రైతులకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో సిపీఐ ఏపి రైతు సంఘం దశలవారీగా రైతులు సమస్యల పట్ల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు నరసింహులు,ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కొట్రేష్, ఏఐవైఎఫ్ తాలూక అధ్యక్షులు కుమార్, సిపీఐ నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు రవి, సిపిఐ నాయకులు తేజ, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.


