Tuesday, November 18, 2025
Homeజిల్లాలుఅనంతపురంపీఏబీఆర్ కాలువ ద్వారా చెరువులకు నీరు అందించాలి..సిపిఐ

పీఏబీఆర్ కాలువ ద్వారా చెరువులకు నీరు అందించాలి..సిపిఐ

- Advertisement -

విశాలాంధ్ర – అనంతపురం రూరల్… జిల్లాలో ఈ సంవత్సరం సరైన వర్షాలు కురవకపోవడంతో అనేక గ్రామాల్లో త్రాగనీటితో పాటు, బోరుబావులు భూగర్భ జలాలు తగ్గిపోయాయని, రైతులకు ప్రజలకు త్రాగునీరు, సాగునీరు సమస్య ఏర్పడిందని పీఏబీఆర్ కాలువ ద్వారా 49 చెరువులకు నీరు అందించాలని చిరుతల మల్లికార్జున సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పేర్కొన్నారు. బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో హెచ్ ఎల్ సి యస్ ఈ కి వినతి పత్రాన్ని అందజేశారు. పీఏబీఆర్ కుడి కాలువ కింద ఉన్న 49 చెరువుల్లో నీరు లేకపోవడంతో దాని కింద ఉన్న గ్రామాలు ప్రజలు కి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలను, రైతులను దృష్టిలో ఉంచుకొని చెరువులకు నీరు వదలడం వల్ల భూగర్భ జలాలు పెరిగి త్రాగునీరు సాగునీరు సరఫరా పెరుగుతుందన్నారు. ఈ కుడికాలువ కింద ఉన్న గ్రామాల్లో రాప్తాడు ఉరవకొండ సింగనమల ధర్మవరం నియోజకవర్గాల్లో 49 చెరువులో కింద రైతులు సాగునీరు ఇస్తేనే అనేక రకాల పంటలు పెట్టడానికి జరుగుతుందని తెలిపారు. కావున తక్షణమే కుడి కాలువకు 5 టీఎంసీలు నీరు కేటాయించి 49 చెరువులకు నీరు ఇవ్వాలని సిపిఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పి రామకృష్ణ, రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి ఎం. రమేష్, రూరల్ మండల కార్యదర్శి జి.నరేష్, సహాయ కార్యదర్శి దుర్గా ప్రసాద్, ఏఐవైఎఫ్ రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి ధనుంజయ, మన్నిలా సూరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు